పెద్ద ప్రమాదమే తప్పింది..ఒకేసారి రన్ వేపైకి రెండు విమానాలు

పెద్ద ప్రమాదమే తప్పింది..ఒకేసారి రన్ వేపైకి రెండు విమానాలు

ముంబై విమానాశ్రయంలో పెద్ద పెద్ద ప్రమాదమే తప్పింది. శనివారం ( జూన్ 8) రెండు విమానాలు ఒకేసారి రన్ వేపై  ప్రమాకరంగా ప్రయాణించాయి.ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే 27లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఇండిగో విమానం ల్యాండ్ అయింది. చాలా దగ్గరగా ఈ రెండు విమానాలు ఒకేసారి రన్ వేపైకి రావడంతో ప్రయాణికులు హడలి పోయారు. 

ఇండిగో ఫ్లైట్ 5053 దేవి అహల్యబాయి హోల్కర్ ఎయిర్ పోర్ట్ నుంచి ఎగురుతూ రన్ వే 27లో ల్యాండ్ అవుతుండగా ఎయిర్ఇండియా ఫ్లైట్ 657 తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. 

గతేడాది నవంబర్ 17న కూడా రెండు ఇండిగో విమానాలు ప్రమాదకరంగా ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి రెండు విమానాలు ల్యాండ్ అవుతుండగా ఘటన జరిగింది. అయితే ఈ ఘటనపై ఇండిగో ఏవియేషన్ స్పందించింది.  

జూన్ 8 2024న ఇండోర్ నుంచి ఇండిగో ఫ్లైట్ 6E 6053కి ముంబై ఎయిర్ పోర్టులో ATC ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చింది. పైలట్ ఇన్ కమాండ్ అప్పోచ్ , ల్యాండింగ్ ను సిద్ధమైంది. ATC సూచనలను అనుసరించింది. ఇండిగోలో ప్రయాణికుల భద్రత మాకు చాలా ముఖ్యమైనది..మేం ప్రక్రియ ప్రకారమే ల్యాండింగ్ జరిగిందని  ఇండిగో ఏవియేషన్ తెలిపింది.